OTR: మాజీ మంత్రి కొండా సురేఖ…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి గతంలో వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పశ్చాత్తాపం ప్రకటించారు. దానికి సంబంధించి ఎక్స్ వేదికగా సారీ కోరడం, అందుకు సంబంధించి వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీని విమర్శించే క్రమంలోనే… ఆ వ్యాఖ్యలు చేశానని, కేటీఆర్ విషయంలో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నారు. తొందరపడి నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కొండా సురేఖ. తన వ్యాఖ్యల.