మొన్నటి వరకు కరవు రూపంలో ఎల్నినో దెబ్బతీస్తే.. ఇప్పుడు అర్నబ్ తుఫాన్ ముంచెత్తి ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని, సామాన్యులను కోలుకోలేని దెబ్బతీసింది. బాపట్ల నుంచి ఉత్తరాంధ్ర వరకు ఎటు చూసినా నేలపాలైన అన్నదాతల కష్టాలు, నీటిపాలైన సామాన్యుల వెతలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ప్రకృతి ప్రకోపం నుంచి జనజీవనం సాధారణ స్థితికి రావడం… మౌలిక వసతుల పునరుద్ధరణ సవాలేనా? ఎంత నష్టం వాటిల్లింది..ఎంత కష్టం వచ్చిపడింది? బయటపడే యాక్షన్ పట్టాలెక్కిందా? అర్నబ్ తుఫాన్ రైతులకు మరింత క్షోభను మిగిల్చింది..