భారత్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ (107 పరుగులు, 49 బంతుల్లో) బాది ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. నా బ్యాటింగ్ ప్రదర్శన చాలా అద్భుతంగా సాగింది. ఈ రోజు పిచ్ బ్యాటింగ్కు చాలా బాగా సహకరించింది. మేము దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం, ఇది చాలా సంతోషంగా ఉంది..