తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ (MRI) సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) మోడ్లో ఈ సేవలను రోగులకు అందుబాటులోకి తేనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. పీపీపీ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే పేషెంట్లకు ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. సుక్రవారం కోటిలోని TGMSIDC కార్యాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన.