రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 14 వేల మెగావాట్ల నుంచి 21 వేల మెగావాట్లకు పెంచిందని తెలిపారు. గోదావరి జలాలను వినియోగించుకుంటూ డీబీఎం-38 ద్వారా 44,770 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, ఎస్సారెస్పీ పరిధిలోని మరో 70 వేల ఎకరాలను అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గం వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.