వరంగల్- ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దిశ, వరంగల్: వరంగల్- ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల అధికారులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు.