England vs Hong Kong: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ (Hong Kong Sixes) తొలి రోజే బ్యాటర్ల విధ్వంసంతో అదరగొట్టింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ అండ్ చైనా (Hong Kong China) బ్యాటర్ అన్షుమన్ కేవలం 10 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తం 13 బంతుల్లో 62 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో హాంకాంగ్ భారీ స్కోరు సాధించింది. England vs Hong Kong: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లోనే అభిమానులకు భారీ వినోదం అందించింది. ఇంగ్లండ్ (England)తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ అండ్ చైనా జట్టు బ్యాటింగ్‌లో దుమ్మురేపింది.