గురు గ్రహాన్ని బృహస్పతి, దేవ గురువు అని కూడా పిలుస్తారు. అన్ని గ్రహాలలో కెళ్లా అతి పెద్ద గ్రహం ఇది. ఇక ఈ గ్రహం సంపద, విద్య, జ్ఞానం, అదృష్టానికి , ఆధ్యాత్మికతకు కారకుడు. అందుకే ఎవరి జాతకంలో అయితే గురు గ్రహం ఉంటుందో, వారికి అద్భుతంగా ఉంటుదని చెబుతుంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో అన్ని రాశి సంచారాల కంటే, గురు సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అతి త్వరలో అంటే అక్టోబర్ 31, శని వారం రోజున గురుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు.