లక్ష్యం పెద్దదైనప్పుడు అడ్డంకులు ఎదురవడం సహజం. అయితే ప్రతి ఓటమిని పాఠంగా మలుచుకుని, పడిన ప్రతిసారీ మరింత పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందని నిరూపించారు ఐపీఎస్ అధికారి గుండాలరెడ్డి రాఘవేంద్ర. ఐదుసార్లు సివిల్స్ మెయిన్స్ పరీక్ష రాశారు. మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ పట్టుదల వీడకుండా ఆరో ప్రయత్నంలో జాతీయస్థాయిలో 180వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు..