పట్టుదల, కృషి ఉంటే విజయం తప్పక సాధ్యమని నిరూపించారు తమిళనాడుకు చెందిన ముగ్గురు సోదరులు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ ఒకే ఏడాది వైద్య విద్య కోర్సుల్లో సీట్లు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. చేనేత కార్మికుడి కుమారులైన ఈ ముగ్గురు సోదరులు నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందడం విశేషం.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వెళ్లాంగుళికి చెందిన రామకుమార్ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. ఆయనకు వెంకట్శ్రీ, అరుణ్, ధరణ్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురూ వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో నీట్ పరీక్షకు సిద్ధమయ్యారు.