భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. IND vs NZ 4th T20I: న్యూజిలాండ్ బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించింది.