నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే JNVST 2026 పరీక్ష హాల్టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 28న జరగనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.. హైదరాబాద్, అక్టోబర్ 30: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అలర్ట్. జవహర్ నవోదయ విద్యాలయ సమితి (NVS) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST) హాల్టికెట్లను అధికారిక పోర్టల్లో అందుబాటులో ఉంచింది.