Hyundai Electric Car-Hyundai Ioniq P: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తన ఉనికిని మరింత బలంగా చాటుకోవడానికి హ్యుందాయ్ మోటార్స్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న క్రెటా ఈవీ (Creta EV) కంటే తక్కువ ధరలో, అత్యంత చౌకైన ఒక ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఆశించిన స్థాయిలో పెద్ద విజయాన్ని సాధించలేకపోయిన హ్యుందాయ్, ఈ కొత్త కార్ ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ప్రత్యేకంగా భారత్ కోసం రూపొందిస్తున్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి కంపెనీ 'HE1i' అనే కోడ్‌నేమ్ కేటాయించింది.