PM Kisan Samman Nidhi 24th Installment 2026: దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పథకం 24వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో భిల్డీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేశారు. ఈ విడతలో 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2,000.