Indian Navy: భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. నేవీ (Navy) కోసం ఏకంగా ఎనిమిది నెక్స్ట్-జెనరేషన్ స్టెల్త్ నౌకల (నెక్స్ట్-జెనరేషన్ కార్వెట్లు - NGC) నిర్మాణానికి రూ.40,000 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో రక్షణ రంగంలో అత్యున్నత స్థాయిలో క్లియరెన్స్ సాధించిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఇది ఒకటి.