Healthy Moong Dal Dry Fruit Laddu Recipe: భోజనం తర్వాత కాస్త తియ్యగా ఏదైనా తింటేనే ఆ మజాయే వేరు. కానీ ఫిట్నెస్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటారు. ఒకవేళ మీకు తీపి తినాలనిపించినా, మైదా, పంచదార, బెల్లం వంటివి వద్దు అనుకుంటే పచ్చి పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ హెల్దీ లడ్డూలను హ్యాపీగా ట్రై చేయవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ముందుగానే చేసి ఎయిర్‌టైట్ బాక్స్‌లో నిల్వ చేసుకుంటే, సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు చక్కటి హెల్దీ స్నాక్‌లా లాగించేయవచ్చు.