CM Revanth Reddy: మియాపూర్‌లోని రూ. 50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలపై, నాటి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్‌లు కలిసి ఈ మియాపూర్ భూములను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని, ఇందుకోసం దామోదర్ రావుకు విలాసవంతమైన కార్లు లంచంగా ఇవ్వడంతో పాటు కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు ముట్టాయని సీఎం ఆరోపించారు.