ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరు జంట నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఇక్కడ స్థలాలు, అపార్ట్మెంట్ల రేట్లు చుక్కలనంటడంతో మధ్యతరగతి వర్గాలు సొంతింటి ఆలోచనను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం నగర పరిధి విస్తరించడం, నూతన రహదారుల అనుసంధానత పెరగడంతో విజయవాడ, గుంటూరు శివారు ప్రాంతాలలో రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల బడ్జెట్లోనే నాణ్యమైన 1బీహెచ్కే, 2బీహెచ్కే అపార్ట్మెంట్లు , ఇండిపెండెంట్ ఇళ్లు అందుబాటులోకి.