విజయవాడలో స్వతంత్ర మేయర్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ప్రచార వాహనాలపై దాడి జరిగింది. ఏబీ వెంకటేశ్వరరావు కోసం ప్రచారం చేస్తున్న ఆటోల మీద దుండగులు దాడి చేసి పోస్టర్లు చింపివేశారు. దిశ, వెబ్ డెస్: విజయవాడలో స్వతంత్ర మేయర్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ప్రచార వాహనాలపై దాడి జరిగింది. విజయవాడలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ సమీపంలో వాహనాలు పార్క్ చేసి ఉన్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వాహనాలపై ఎవరు దాడికి పాల్పడ్డారు అన్నది తెలియాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మేయర్ అభ్యర్థి వాహనాలపై దాడి జరగడం షాకింగ్‌గా మారింది.