స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు విజయవాడ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించారు. విజయవాడ, అక్టోబర్ 30: నవంబర్ 1న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది.. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అక్టోబర్ 29, 30 తేదీల్లో బ్యాలెట్ పద్దతిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది.