మాటలతో గారడీ చేశారు.. చేతలతో బురిడీ కొట్టించారు.. కొందరి అధికారుల నిర్లక్ష్యం, గత పాలకుల స్వార్థం కారణంగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విస్తరణ పనులపై అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి పట్టణాల్లో 3 లక్షల వరకు జనాభా ఉన్నారు. పట్టణ ప్రజల కష్టాలు తొలగించేలా రోడ్ల విస్తరణ చేయాల్సి ఉన్నా.. అన్నీ సగం పనులే..: అనకాపల్లి పట్టణంలోని పెరుగుబజార్ కూడలి నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకు కి.మీ దూరం ఉంటుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్కు ప్రధానమైన మార్గం ఇదే.