పొత్తు ధర్మంలో భాగంగా కూటమి పార్టీలు జడ్పీ, మండల పరిషత్తు స్థానాలను సర్దుబాటు చేసుకున్నాయి. 24 జడ్పీటీసీ స్థానాల్లో తెదేపా - 17, జనసేన - 5, భాజపా - 2 చోట్ల పోటీ చేస్తున్నాయి. 427 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి తెదేపా - 294, జనసేన - 119, భాజపా - 14 చోట్ల బరిలో ఉన్నాయి. మండల పరిషత్తు అధ్యక్ష పదవులను నియోజకవర్గాల ఇన్ఛార్జులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు చర్చించి సర్దుబాటు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో రెబల్స్ బెడద లేకపోవడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించారు. జిల్లాలో అందరి దృష్టి ఎంపీపీ పీఠాలపైనే ఉంది.