ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం.. మార్కెట్లో బ్రాండెడ్ సన్న బియ్యంగా మారుతున్నాయి. కర్మన్ఘాట్ పరిసరాల్లో అమ్మకాలుపలు దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలుబస్తాల తూకంలోనూ తేడాలు గుర్తింపుఆరుగురు వ్యాపారులపై క్రిమినల్ కేసులుహైదరాబాద్ సిటీ, రంగారెడ్డి అర్బన్, ఎల్బీనగర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం.. హైదరాబాద్లోని కర్మన్ఘాట్ పరిసర ప్రాంతాల్లో బ్రాండెడ్ బియ్యం పేరుతో రేషన్ బియ్యాన్ని వ్యాపారులు విక్రయిస్తున్నట్లు బయటపడింది. లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి, మిల్లులకు తరలించి, పాలిష్ చేసి బ్రాండెడ్ సన్న బియ్యం తరహాలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారని ఆరోపణలు రావటంతో గురువారం పలు దుకాణాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.