ఆన్లైన్ ట్రేడింగ్లో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.29.91 లక్షలు కాజేశారు. ఇద్దరి నుంచి రూ.29.91 లక్షలు కాజేసిన నేరగాళ్లుహైదరాబాద్ సిటీ: ఆన్లైన్ ట్రేడింగ్లో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.29.91 లక్షలు కాజేశారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కూకట్పల్లికి చెందిన 49 ఏళ్ల మెడికల్ రైటర్ (బాధితుడు)కు ఆగస్టులో ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ లింక్ కనిపించింది. దానిపై క్లిక్ చేయడంతో ‘ఎస్ఐజీ గ్రూప్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేరాడు. ‘నిఫ్టీపీడబ్ల్యూఎం’ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కేవైసీ పూర్తి చేశాడు.