ఆర్ఎస్ఎం యూఎస్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. హైదరాబాద్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. సరికొత్తగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన కార్యాలయాన్ని గురువారం ప్రారంభించింది. హైదరాబాద్, అక్టోబర్ 29: ఆర్ఎస్ఎం యూఎస్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రతిభా కేంద్రాల్లో ఒకటైన భారత్లో సంస్థ కీలకంగా అడుగులు వేస్తున్నదని, వృద్ధి, ప్రత్యేక నైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆర్ఎస్ఎం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)కి హైదరాబాద్ కీలకంగా మారిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన మూడేండ్లకాలంలో సంస్థలో ఉద్యోగుల సంఖ్య 150కి పెంచినట్టు చెప్పారు.