రాజకీయాల్లో మైకు దొరికితే చాలు.. విమర్శల తూటాలు పేల్చడం, ప్రత్యర్థులపై ఆరోపణల వర్షం కురిపించడం సర్వసాధారణం. అయితే, ఆవేశంలోనో లేక రాజకీయ వేడిలోనో హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితే మాత్రం.. చివరకు అదే మైకు ముందు తలదించుకుని సారీ చెప్పక తప్పని పరిస్థితులు ఎదురవుతుంటాయి. తాజాగా కేటీఆర్కు తెలంగాణ మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.