బాదం పప్పులను ఆరోగ్యకరమైన చిరుతిండిగా చాలామంది తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే మార్కెట్లో సాధారణ బాదంతో పాటు మమ్రా బాదం అనే ప్రత్యేక రకం కూడా అందుబాటులో ఉంటుంది. ఇవి సాధారణ బాదం కంటే ఖరీదుగా ఉండటంతో పాటు, వాటి ఆకారం, రుచి, నూనె శాతం వంటి లక్షణాల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఖరీదైన బాదం కాబట్టి ఎక్కువగా తింటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయా? రోజుకు ఎన్ని గింజలు తినాలి? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.