రంజీ ట్రోఫీలో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ (Chinmay Sutar) సంచలనం సృష్టిస్తున్నాడు. నాగాలాండ్‌పై ఏకంగా 400 పరుగులు చేసిన ఈ 29 ఏళ్ల బ్యాటర్.. ఇప్పుడు మేఘాలయపై మరో శతకం బాదాడు. తొలి నాలుగు ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు చేసి, 100 ఏళ్ల నాటి విల్ పోన్స్‌ఫోర్డ్ రికార్డును అధిగమించాడు. కొద్ది రోజుల క్రితం చిన్మయ్ సుతార్ రంజీ ట్రోఫీ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించాడు. నాగాలాండ్‌పై 517 బంతులు ఎదుర్కొని అజేయంగా 400 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 46 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.