Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో అరబ్ ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బులు ఖర్చు చేసిందన్న ఆరోపణల్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. తమ దేశాన్ని ఇజ్రాయిల్ రాజకీయ నాయకుల వైఫల్యాలకు బలిపశువును చేయొద్దని దోహా స్పష్టం చేసింది. ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందన్న అనుమానాలపై ఇజ్రాయిల్ అంతర్గత భద్రత సంస్థ షిన్ బెట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఖతార్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ.