ఢిల్లీ వేదికగా నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన కోసం భారతీయులమంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించినదాని కంటే వేగంగా వృద్ధి సాధిస్తోందని, మధ్య ఆసియా సంక్షోభం వంటి సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సంప్రదాయ అంచనాలను అధిగమించి ఎగుమతులు పెంచుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని తొలి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో.