రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోంది. ములుగు, న్యూస్టుడే: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోంది. శిక్షణ, ఉపాధి, ఉత్పత్తుల తయారీ నుంచి గ్లోబల్ మార్కెట్లలో విక్రయాల వరకు అవసరమైన ప్రతి అవకాశాన్ని ఒకే వేదికపై అందించేందుకు ప్రతి జిల్లాకు ఒక ‘ఇందిరా మహిళా శక్తి’ భవన నిర్మాణాన్ని చేపట్టింది. వీటితో పాటు గ్రామస్థాయిలోనూ వీవోల కోసం మహిళా భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. అద్దె భవనాల్లో, చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకున్న మహిళా సంఘాల సభ్యులకు శాశ్వత భవనాలు సమకూరుతున్నాయి.