విధుల్లో ఉండగానే మద్యం మత్తులో జోగుతున్న ఉద్యోగి నిర్వాకం పట్ల వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపురం, న్యూస్టుడే: విధుల్లో ఉండగానే మద్యం మత్తులో జోగుతున్న ఉద్యోగి నిర్వాకం పట్ల వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సబ్స్టేషన్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం పట్ల సమాచారం తెలుసుకునేందుకు గురువారం గ్రామస్థులు వెళ్లగా లైన్ ఇన్స్పెక్టర్ పిట్టల రాజు సబ్స్టేషన్లోనే మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. నిత్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.