వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని మిఠాయిల తయారీ కేంద్రాలు, నూనె మిల్లులు, ఆహార సంబంధ ముడిపదార్థాల ప్రాసెస్ యూనిట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈనాడు, వరంగల్ : వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని మిఠాయిల తయారీ కేంద్రాలు, నూనె మిల్లులు, ఆహార సంబంధ ముడిపదార్థాల ప్రాసెస్ యూనిట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. చాలాచోట్ల నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు గుర్తించి తొమ్మిది తయారు కేంద్రాల లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని మరో సంస్థకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.