తిరుపతి, మేజర్ న్యూస్ :తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. కూటమి మేయర్ అభ్యర్థి మన్యం శ్రీనివాస ప్రసాద్ @ జేబీ శ్రీనివాస్... కార్పొరేటర్ తో కలిసి మేయర్ అభ్యర్థి ఇంటింటికీ తిరుగుతూ మెరుపు వేగంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు డివిజన్లల రోడ్ షో లకు, పాదయాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రచారం చివరి దశకు వచ్చింది కానీ ప్రజల్లో ఉత్సాహం మొదటి రోజులా ఉంది. నేను తిరిగిన ప్రతి ఇంట్లో, ప్రతి షాపులో ఒకటే మాట వినిపిస్తోంది చెప్పాం చేస్తున్నాం చేస్తాం అని.