అత్యంత రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో మరో ట్విస్ట్.. గత వారం లాగే హౌస్ లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. తక్కువ ఓట్లు పడిన ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారని సమాచారం. 'బిగ్బాస్ తెలుగు సీజన్ 10' రసవత్తరంగా, హోరాహొరీగా సాగుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులకు అద్దిరిపోయే ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ కూడా పోటాపోటీగా ఆడుతున్నారు. ఫిజికల్ టాస్కుల్లో, గేమ్స్ లో సై అంటే సై అనేలా తలపడుతున్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ చాలా డిఫరెంట్ గా కనిపించింది.