భారత్‌లో ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్‌ను చెబుతారు. తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించాడు. అయితే పాకిస్థాన్‌లోనూ ఒక రాజభవనం వెనుక ప్రేమకథ ఉందని చెబుతుంటారు. గులాబీ, పసుపు రంగు రాళ్లతో అందంగా నిర్మించిన ఈ భవనం పేరు మొహట్టా ప్యాలెస్. కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో సముద్ర తీరానికి సమీపంగా ఉన్న ఈ చారిత్రక కట్టడాన్ని రాజస్థాన్‌కు చెందిన హిందూ వ్యాపారవేత్త శివ్ రతన్ మొహట్టా 1927లో నిర్మించాడు. తన అనారోగ్యంతో ఉన్న భార్య సముద్రపు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మించాడనే కథ ప్రచారంలో ఉంది.