టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన ఓ ‘బ్లైండ్ ర్యాంకింగ్’ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘ఎప్పటికీ అత్యుత్తమ బ్యాటర్ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానంగా ఒక్కొక్కరి పేరు చెప్పగానే ర్యాంక్ కేటాయించిన శ్రీకాంత్.. డాన్ బ్రాడ్మన్కు నంబర్ వన్ స్థానం ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా అతడి టాప్-10లో ఉన్నారు. ఈ ప్రశ్నకు ఒక్క సమాధానం చెప్పడం అంత సులభం కాదు. వేర్వేరు తరాలకు చెందిన దిగ్గజాలను పోల్చడం ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చే.