పిల్లలు బాగా చదువుకోవాలని, చదివిన విషయాలను అర్థం చేసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే కొంతమంది పిల్లలు పుస్తకం తెరవగానే మరో పని గుర్తొచ్చిందని చెబుతారు. హోంవర్క్ చేయమంటే మారాం చేస్తారు. చదవడానికి కూర్చున్నా కొద్దిసేపటికే వారి దృష్టి మరెక్కడికో వెళ్లిపోతుంది. దీంతో తల్లిదండ్రులు పదేపదే చెప్పడం, మందలించడం చేస్తుంటారు. కానీ ఇలా ఒత్తిడి పెంచడం కంటే పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగించేలా వాతావరణాన్ని మార్చడం మంచిది. పిల్లల మనసును అర్థం చేసుకుని చిన్న చిన్న మార్పులు చేస్తే చదువును భారంగా కాకుండా నేర్చుకునే ఆసక్తికరమైన పనిగా మార్చవచ్చు.