యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులు అత్యం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమా 'రామాయణ'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా మైథలాజికల్ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి సీతారాముల కల్యాణం సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, సౌతిండియన్ న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతారాములుగా నటిస్తోన్న సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీలో కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు.