Rowdy Janardhana: టాలీవుడ్లో ఇప్పుడు ఎవరి ప్రాజెక్ట్ చూసినా ‘పార్ట్-1’, ‘పార్ట్-2’ ఫార్ములానే నడుస్తోంది. బాహుబలి, పుష్ప సినిమాలు రెండు పార్ట్‌లుగా రాగా, సలార్, దేవర లాంటి సినిమాలు పార్ట్ 1 తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడంతో మిగతా హీరోలు, డైరెక్టర్లు కూడా ఇదే రూట్ పడుతున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ ట్రెండ్‌లోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది..