Diwali Bonus: పండుగ సీజన్ మొదలవుతుందంటేనే ఉద్యోగుల కళ్లన్నీ బోనస్‌ల వైపే ఉంటాయి. అలాంటిది పండుగ పూట చేతినిండా పైసలు అందుతాయంటే ఆ ఆనందమే వేరు. సరిగ్గా దీపావళికి ముందే ఆ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. ఏటా ఇచ్చే పండుగ నజరానాను ఈసారి మరింత పెంచుతూ.. ఏకంగా రూ.33,000 బోనస్ ఇస్తున్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారికంగా ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.2,000 అదనంగా పెంచడంతో ఉద్యోగుల ఇళ్లలో పండుగ.