రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి కేసులో దారుణ నిజం వెలుగులోకి వచ్చింది. కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తల్లి అల్లిన కల్పిత కథను పోస్టుమార్టం నివేదిక పటాపంచలు చేయగా, కన్నతల్లే కాలయముడిగా మారి గొంతు నులిమి చంపినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. కొత్తూరు హనుమాన్ టెంపుల్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ముయ్యాది రాజు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె సువర్చల అలియాస్ లవ్లీ (14).