వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ (క్రిస్టియన్ కాలనీ)లో ఉన్న పార్కు స్థలాన్ని కాపాడాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దిశ, వరంగల్: వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ (క్రిస్టియన్ కాలనీ)లో ఉన్న పార్కు స్థలాన్ని కాపాడాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 388లోని సుమారు 18 గుంటల పార్కు స్థలాన్ని కొందరు నకిలీ పత్రాలతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థలానికి సంబంధించిన పత్రాలను విచారణ అధికారికి అందజేశారు. ఇప్పటికే పార్కు స్థల పరిరక్షణ కోసం 18వ డివిజన్‌కు చెందిన అఖిలపక్ష నాయకులు జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.