జీవీఎంసీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోందని, మొత్తం120 వార్డుల నుంచి కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా ముక్క శ్రావణి పోటీ చేస్తున్నారన్నారు. విశాఖపట్నం, అక్టోబర్ 29: జీవీఎంసీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోందని, మొత్తం120 వార్డుల నుంచి కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. వైసీపీ నాయకులు తమపై బురద జల్లుతున్నారని ఎంపీ మండిపడ్డారు. విశాఖకు కూటమి ఏమీ చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ను అభివృద్ధి పథంలో నడపడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీని తెచ్చామన్నారు.