ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీలో పలు రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై నీళ్లు చేరడంతో దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో నాలుగు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం, అక్టోబర్ 29: ఆర్నబ్ తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టించింది. నిన్న యానాం- నరసాపురం మధ్య పల్లెపాలెం వద్ద తీరం అతి తీవ్ర తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో దాదాపు 150 కి.మీ వేగంతో పెనుగాలులు వీచాయి. ఇక ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీలో పలు రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు.