‘అర్నబ్’ తుపాను ధాటికి మార్షల్ ఐలాండ్‌కు చెందిన భారీ కార్గో నౌక ‘సిగ్మా పెరల్’ సముద్రంలో నిలిచిపోయింది. విశాఖపట్నం: ‘అర్నబ్’ తుపాను ధాటికి మార్షల్ ఐలాండ్‌కు చెందిన భారీ కార్గో నౌక ‘సిగ్మా పెరల్’ సముద్రంలో నిలిచిపోయింది. విశాఖలో సరకు అన్లోడ్ చేసి సింగపూర్ వెళ్తుండగా కేజీ బేసిన్లో రవ్వ ఆయిల్ క్షేత్రం వద్ద చిక్కుకుంది. ఇంజిన్ ఫెయిల్ కావడంతో నౌక నిలిచిపోయినట్లు సమాచారం. నౌకలోని సిబ్బందిని కాపాడేందుకు కోస్ట్‌గార్డ్ అధికారులు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు నుంచి ఆపరేషన్ చేపట్టారు. ‘సిగ్మా పెరల్’ నౌక వద్దకు కోస్ట్‌గార్డ్ నౌక సుజయ్‌ను పంపించారు.