పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ పసిడి ధరలు భారీగా దిగొచ్చాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతుండగా.. ఇవాళ బ్రేక్ పడింది. సిల్వర్ ధరలు భారీగా కుప్పకూలాయి. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది.వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయడంతో దీని ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతుంది. బంగారం, వెండి ధరలు గంటల్లోనే తగ్గుముఖం పట్టాయి. పండక్కి గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఒక్కసారిగా ధరల పెరుగుదలకు బ్రేక్ పడటంతో సంతోషపడుతున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయడమే ధరలు తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు.