పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎప్పుడు తప్పనిసరి? పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఎవరిని సంప్రదించాలి? జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? ఉచిత ఎఫ్ఐఆర్ కాపీ పొందే హక్కు, బీఎన్ఎస్ఎస్–2023 నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పు గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే. ఒక మహిళ తన వస్తువు దొంగతనానికి గురైందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. “ఒక్కసారి ఆలోచించుకుని రండి” అని ఉచిత సలహా ఇచ్చి పంపేశారు. ఆమె ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు, కేసు నంబర్ లేకుండానే వెనక్కి తిరిగి వచ్చింది. ఇది సాధారణంగా జరిగే చిన్న విషయంగా అనిపించవచ్చు..