దీపావళి సందర్భంగా ఆఫీసుల్లో కొలీగ్స్, స్నేహితుల నుంచి బహుమతులు అందుకుంటూ ఉంటారు. ఇక బంధువులు, పొరుగువారు నుంచి గిఫ్ట్ స్వీకరిస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఐటీ శాఖ విధించిన పరిమితి కంటే బహుమతులు ఎక్కువ తీసుకుంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీపావళి అనేది దేశంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ. కులమతాలకు అతీతంగా అందరూ దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. పండుగ వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.