టాలీవుడ్ స్టార్ హీరో గురించి నటుడు సుబ్బలేఖ సుధాకర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఆయనను చిన్నపిల్లాడి మనస్తత్వమున్న మంచి వ్యక్తిగా సుధాకర్ తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాలకృష్ణ, చిరంజీవి ఇచ్చిన మానసిక ధైర్యాన్ని గుర్తుచేసుకున్నారు. వారి అంకితభావం, నిబద్ధతను ప్రశంసించారు. అలాగే ఆ ఇద్దరూ హీరోలతు తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీనియర్ నటుడు సుబ్బలేఖ సుధాకర్ నటసింహం నందమూరి బాలకృష్ణతో తనకున్న అనుబంధం, బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలకృష్ణ చిన్నపిల్లాడి మనస్తత్వమున్న వ్యక్తి అని, అత్యంత నిష్కపటంగా, దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారని సుబ్బలేఖ సుధాకర్ అన్నారు.